Home » AP Assembly Polls 2024
21 రోజులపాటు వేచిచూసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అటు కేంద్రంలో, ఇటు ఏపీలోనూ అధికారాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే తరువాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నేడు (బుధవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి చేతిలో తన వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాజయం చవిచూడటంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తన రాజీనామా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విషయంలో ఎంత అహంకారం ప్రదర్శించారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సీఎం స్థాయిలో..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 130కి పైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇదే సమయంలో టీడీపీ అనేక రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఘన విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల ఓట్లను సైతం మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఏపీ ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనుందనే దానిపైనే సర్వత్ర ఆసక్తి రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించడాన్ని వైసీపీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.