Share News

YS Jagan Mohan Reddy: వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఫలితాలు రాగానే..

ABN , Publish Date - Jun 04 , 2024 | 08:18 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి చేతిలో తన వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాజయం చవిచూడటంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తన రాజీనామా..

YS Jagan Mohan Reddy: వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఫలితాలు రాగానే..
YS Jagan Mohan Reddy Resigned As AP Chief Minister

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) టీడీపీ కూటమి (TDP Alliance) చేతిలో తన వైఎస్ఆర్‌సీపీ (YSRCP) ఘోర పరాజయం చవిచూడటంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు (Abdul Nazeer) పంపించారు. ఇందుకు ఆయన ఆమోదం తెలిపినట్లు సమాచారం. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ చరిత్రలోనే దారుణ ఓటమిని ఎదుర్కొంది. కేవలం పది స్థానాలకే పరిమితం అయ్యింది. ఇది చూసి వైసీపీ నేతల నోళ్లు మూగబోయాయి.


వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

మరోవైపు.. ఓటమి ఖాయమైన తర్వాత జగన్ మీడియా సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పలితాలు ఆశ్చర్యం కలిగించాయని.. ప్రజలు బాగుండాలని మంచి చేసినప్పటికీ ఓటమిపాలయ్యామని పేర్కొన్నారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని తాము ఊహించలేదన్నారు. మహిళలకు సంక్షేమ ఫలాలు అందించామని.. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని అన్నారు. 53 లక్షల మంది తల్లులకు మంచి చేశామని.. 26 లక్షల మంది అవ్వతాతలు, వృద్ధులు, వికలాంగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు అందించామని.. ఆ అవ్వతాతల ప్రేమ ఏమైందో తెలియడం లేదని వాపోయారు.

Read Also: నితీశ్ కుమార్ యూ-టర్న్.. ఇది దిమ్మతిరిగే ట్విస్ట్?

కోటి ఐదు లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు మంచి చేశామని.. వారి కష్టాలను తమ కష్టాలుగా భావించామని, వాళ్లకు అండగా నిలిచామని జగన్ పేర్కొన్నారు. వారి ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియట్లేదని చెప్పారు. చదువుల్లోనూ ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చామని.. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందోనని భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో పథకాలు ఇచ్చామని.. అయినా రిజల్ట్ ఇలా వస్తుందని అనుకోలేదన్నారు. ఏదేమైనా.. గొప్ప విజయం సాధించినందుకు కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 08:18 PM