Home » AP Congress
లాభాల్లో నడుస్తున్న ఉక్కు కర్మాగారం అమ్మకానికి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ రెడ్డి గంగవరం పోర్టును అదానీ పాలు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. శనివారం నాడు విశాఖలో జరిగిన ‘సేవ్ విశాఖ-సేవ్ స్టీల్ ప్లాంట్’ సభలో షర్మిల మాట్లాడుతూ.. కేవలం భూముల కోసం విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి నష్టాల్లోకి తీసుకెళ్లారని మండిపడ్డారు.
Andhrapradesh: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శనివారం) ఏపీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి రేవంత్ ఆంధ్రాలో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
లక్టోరల్ బాండ్లతో అక్రమంగా సంపాదించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. గురువారం నాడు ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నా.. కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఎస్బీఐ ఎదుట షర్మిలతో పాటు జేడీ శీలం, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు నిరసన చేపట్టారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీజేపీ నాయకుడేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని అందరూ బీజేపీకి ‘బీ’ టీంగా చిత్రిస్తున్నారని.. కానీ బీజేపీలోనే వైసీపీ ఉందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో హామీ ఇచ్చిన చోటే.. శుక్రవారం ప్ర
ఏపీలో ‘‘ఇందిరమ్మ అభయం’’ పేరుతో మొదటి గ్యారెంటీను AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా గ్యారెంటీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. సోమవారం నాడు అనంతపురం పట్టణంలో ఏపీ పీసీసీ ‘‘న్యాయ సాధన’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది.
అనంతపురం: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ (Congress) మొదటి గ్యారంటీ ప్రకటించింది. ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని అన్నారు. అనంతపురం పట్టణంలో ఏపీసీసీ నిర్వహించిన ‘న్యాయ సాధన సభ’ భారీ బహిరంగ సభలో ఆమె ఈ ప్రకటన చేశారు.
Andhrapradesh: వైఎస్సార్సీపీ ఇంచార్జిల మార్పుల్లో టికెట్ కోల్పోయి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్కే కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఏసీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారి స్పందించారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని అడిగితే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు.