Big Breaking: కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల!
ABN , Publish Date - Mar 18 , 2024 | 09:44 AM
YS Sharmila Kadapa MP Candidate: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పటికే వైసీపీ (YSR Congress), టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి అభ్యర్థులను దాదాపు ప్రకటించేయగా.. కాంగ్రెస్ (Congress) మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. అయితే ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పటికే వైసీపీ (YSR Congress), టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి అభ్యర్థులను దాదాపు ప్రకటించేయగా.. కాంగ్రెస్ (Congress) మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. అయితే కాంగ్రెస్ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించడానికి అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితోనే (YS Sharmila Reddy) అభ్యర్థుల ప్రకటన మొదలుపెట్టాలని హైకమాండ్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాదనలేక ఓకే..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కడప లోక్‌సభ (Kadapa Parliament) నుంచి వైఎస్ షర్మిల పోటీచేస్తారని తెలుస్తోంది. వైసీపీని దెబ్బ కొట్టాలంటే.. సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఇరకాటంలోకి నెట్టాలంటే కడప ఇలాఖాలోనే గట్టిగా కొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కడప ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ, ఏపీపీసీసీ నుంచి షర్మిలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఏఐసీసీ నేతలే రంగంలోకి దిగి పోటీ చేయాలని చెప్పడంతో కాదనలేక కడప ఎంపీగా పోటీకీ అంగీకరించారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో తొలి పేరు షర్మిలదే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మంగళవారం నాడు సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇదే జరిగితే గట్టి సమరమే..!
కాగా.. ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అధిష్టానం సీటివ్వదని పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ జగన్ మాత్రం అటు తిరిగి.. ఇటు తిరిగి అవినాశ్‌కే టికెట్ ఇచ్చారు. ఆయనపై వ్యతిరేకతతో కచ్చితంగా కాంగ్రెస్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని హైకమాండ్ గట్టి నమ్మకంతో ఉందట. షర్మిల పోటీచేస్తారన్న విషయం పక్కా అయితే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలోకి దిగినట్లు అవుతుంది. అవినాశ్ వర్సెస్ షర్మిల మధ్య పెద్ద సమరమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు, నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యనే వైజాగ్ నుంచి షర్మిల పోటీచేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు సడన్‌గా కడప నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..