AP Politics: వైఎస్ షర్మిల, సునీతలపై దస్తగిరి ఫైర్.. ఫిర్యాదు
ABN , Publish Date - Apr 08 , 2024 | 04:50 PM
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.
అమరావతి: మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని మండిపడ్డారు. సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి టీడీపీ, షర్మిల, సునీతలపై దస్తగిరి ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కోరారు.
Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వివేకా హత్య గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. కడపలో షర్మిల చేసిన ప్రసంగంపై దస్తగిరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఆదేశించినప్పటికీ షర్మిల, సునీతారెడ్డి, టీడీపీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా కోరారు.
AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
పులివెందుల నుంచి ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని తనకు షర్మిల, సునీత మాట్లాడే మాటలు ఇబ్బందిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ అండదండలతో ఇలాంటి ఆరోపణలు చేయటం ఎలక్షన్ కమిషన్ నిబంధనలకి వ్యతిరేకమని దస్తగిరి తెలిపారు.
తక్షణమే వివేకా హత్య కేసుకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రసంగాలు చేయకుండా, మీడియా కూడా ఎలాంటి కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో దస్తగిరి కోరారు.
మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ రూల్స్‌ను పూర్తిగా తుంగలో తొక్కి రాజకీయ ప్రసంగాల్లో ఈ హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న సునీత, షర్మిల, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తక్షణమే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని దస్తగిరి చెప్పారు. హైకోర్టులో ఇప్పటికే పిటీషన్ దాఖలు చేయడానికి దస్తగిరి సన్నద్ధమైనట్లు సమాచారం.
Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!
మరిన్ని ఏపీ వార్తల కోసం...