Home » AP Governor Abdul Nazeer
తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.
ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari)అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazir) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం ఓ లేఖ రాశారు. అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు.