AP Elections 2024:గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. కారణమిదే..?
ABN , Publish Date - May 15 , 2024 | 09:55 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు. రాయలసీమలో హింసాత్మక ఘటనలపై రెండు పార్టీల్లోని నేతలు గవర్నర్‌ను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అనంతరం వైసీపీ నేతలు హింసకు దిగుతున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్నికల అనంతరం హింస, ఆస్తులను ధ్వసం చేయడమే కాకుండా హత్యలకు కూడా తెగబడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరారు. అడ్డుకోకపోతే మరింతగా హింస చెలరేగే అవకాశముందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసను అరికట్టాలని గవర్నర్‌ను టీడీపీ నేతలు కోరారు.
ఇవి కూడా చదవండి
AP Politics: టియర్ గ్యాస్ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత
AP Elections: అంతలోనే మాట మారింది..?