AP Election 2024: ఆ బిల్లులను వెంటనే నిలిపివేయాలి.. ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
ABN , Publish Date - May 14 , 2024 | 05:42 PM
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazir) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం ఓ లేఖ రాశారు. అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు.
అమరావతి: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazir) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం ఓ లేఖ రాశారు. అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు. లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
లేఖలోని అంశాలు ఇవే..
► రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోంది.
► కొద్దిరోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారు.
► ఎన్నికల కోడ్‌కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు.
► ఎన్నికల కోడ్‌కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమకాలేదో చెప్పాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
► అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే.
► ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుంచి తరచూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది.
► పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది.
► ఆరోగ్య శ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి.
► ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్‌కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించింది.
► రుణాలు కింద తెచ్చిన రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా రూ.7000 కోట్లు ప్రభుత్వం సమీకరించింది.
► ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోంది.
► రాజకీయ స్వార్థం కోసం చేసే ఇలాంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.
► ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి.
► లబ్ధిదారులకు మేలు చేసే డీబీపీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలి.
► ఏపీ గవర్నర్‌కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా చంద్రబాబు నాయుడు జత చేశారు.
Mukesh Kumar Meena: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..
Read Latest AP News And Telugu News