Home » AP Pensions
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు (బుధవారం) గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లను పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్న ప్రకటనతో ఉదయం నుంచే వృద్ధులు, వితంతువులు సచివాలయాలకు చేరుకుంటున్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వికలాంగులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నిబంధనలకు వైసీపీ తూట్లు పొడిచేందుకు యత్నిస్తోంది. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులను మంచాలపై పడుకోబెట్టి సచివాలయాల వద్దకు వైసీపీ శ్రేణులు మోసుకెళ్తున్న దృశ్యాలు పలు ఛానళ్లలో ప్రసారం అయ్యాయి.
Andhrapradesh: గ్రామ సచివాలయం వద్ద ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వృద్ధాప్య వితంతు పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పారదర్శకంగా పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సచివాలయంలో పెన్షన్లను అందజేయనున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సామాజిక మధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు.
Andhrapradesh: వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈరోజు నుంచి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి ఆరు వరకు పెన్షన్లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు వరకు పెన్షన్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పెన్షన్లు ఇస్తారని తెలిసిన వృద్ధులు, వితంతువులు ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లోని సచివాలయాలకు తరలివచ్చారు.
ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ (CM Jagan) కుట్రలను, వాస్తవాలను ప్రజలంతా తెలుసుకోవాలని కోరుతూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) బహిరంగ లేఖ రాశారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం (AP Govt) మార్గదర్శకాలను జారీ చేసింది. రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
మండుటెండల కాలంలో అవ్వాతాతలకు ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
Andhra Pradesh Pensions: ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ (Pensions) విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల (Volunteers) ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం చేసింది టీడీపీయేనని వైసీపీ.. మాకేంటి సంబంధం అని కూటమి ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన వచ్చేసింది..