Share News

AP Elections: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:27 PM

Andhra Pradesh Pensions: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ (Pensions) విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల (Volunteers) ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం చేసింది టీడీపీయేనని వైసీపీ.. మాకేంటి సంబంధం అని కూటమి ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన వచ్చేసింది..

AP Elections: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పెన్షన్ల పంపిణీ (Pensions) విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల (Volunteers) ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం చేసింది టీడీపీయేనని వైసీపీ.. మాకేంటి సంబంధం అని కూటమి ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన వచ్చేసింది.

Jagan Vs CBN: వైఎస్ జగన్‌పై చెప్పు విసరడం భావప్రకటన స్వేఛ్చ కాదా.. ఇప్పుడు తెలిసొచ్చిందా..!?

ఇలా తీసుకోండి..!

పింఛన్ల పంపిణీపై అధికారులకు సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో మాత్రమే సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ వల్ల వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని కూడా తెలిపింది. పింఛను లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లి పెన్షన్లు తీసుకోవాలని సెర్ప్ తెలిపింది.


Janasena: మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్

విజయం ఎవరిది..?

కాగా.. ఎన్నికల కమిషన్ ఆదేశాల తర్వాత.. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈసీ ఆంక్షల నేపథ్యంలో సచివాలయంలోనే పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్-03 నుంచి పెన్షన్ల పంపిణీ ఉంటుందని.. పెన్షనర్లు ఎవరూ భయపడొద్దని సజ్జల చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడం వల్లే ఇదంతా జరిగిందని.. ఇది తమ విజయమేనని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే.. వలంటీర్లకు చెక్ పెట్టినా ప్రత్యామ్నాయం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అయితే పంపిణీ ఉంటుందని వైసీపీ చెప్పుకుంటోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 04:33 PM