AP Govt: పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Apr 02 , 2024 | 05:39 PM
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం (AP Govt) మార్గదర్శకాలను జారీ చేసింది. రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో గత రెండు రోజులుగా పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అలాగే ఎన్నికల విధుల్లో కూడా వలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం (AP Govt) దృష్టి సారించింది.
దీనిలో భాగంగానే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
AP Election 2024: భారత ఎన్నికల సంఘానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ
మూడు రోజుల పాటు గ్రామ, వార్డు, సచివాలయాల్లో పంపిణీ చేయాలని సూచించింది. ఆ తర్వాత నేరుగా ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించింది. సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీలు, పంచాయతీ అధికారులకు పెన్షన్లు డ్రా చేసేందుకు, పంపిణీకి ఆథరైజేషన్ లెటర్లు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ విడుదల చేశారు.
AP Election 2024: అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి