Home » AP Secretariat
పింఛన్ల పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. సోమవారం నాడు కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీపై రివైజ్డ్ మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు.
ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు.
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నారని.. ఇప్పుడు రూ.370 కోట్ల రుణం ఎలా తెచ్చారని ప్రశ్నించారు.
పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు! చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన! ఆయనే... రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కనపెట్టి... శ్రుతిమించిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు...
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి..