Share News

CM Chandrababu: కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..

ABN , Publish Date - Sep 25 , 2024 | 08:33 PM

నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Chandrababu: కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
CM Chandrababu Naidu

అమరావతి: నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్డీయే ప్రభుత్వంలో పదవిని అహంకారంగా భావించకుండా బాధ్యతతో మెలగాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు.


అహంకారం ప్రదర్శించవద్దు..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ఎన్డీయే ప్రభుత్వంలో పదవి అనేది బాధ్యత. మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే గుర్తు పెట్టుకోవాలి. ప్రజల కంటే మనం ప్రత్యేకమని భావించకూడదు. మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారు. మన ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హుందాగా ఉండాలి. ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చాం. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించాం. మంచి ఫలితాలు వచ్చాయి. నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించాం. ఫేజ్- 1లో ముందుగా కొందరికే పదవులు ఇవ్వగలిగాం.

Payyavula Keshav: తిరుమల లడ్డూ వివాదం.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్..


నేతలు తొందరపడొద్దు..

ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. కొందరు నాయకులు తొందరపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మన పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంతవరకూ అవకాశం కల్పించాం. కష్టపడిన వారికి మొదటి లిస్టులో ప్రాధాన్యం ఇచ్చాం. మిగిలిన వారికీ అవకాశాలు వస్తాయి. అంటే.. మిగిలిన వారు పనిచేయలేదని అర్థం కాదు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన వారు, ఆస్తులు కోల్పోయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. టీడీపీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లూ ఉన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చెయ్యాలనే విషయంలో స్పష్టంగా ఉన్నాం. కష్టపడిన ఏ ఒక్కరినీ విస్మరించం.

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..


సామాజిక న్యాయం పాటించాం..

నామినేటెడ్ పదవుల విషయంలో సామాజిక న్యాయం పాటించాం. జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మీకు కేటాయించిన విభాగాలను ముందుగా బాగా స్టడీ చేయండి. ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చనే విషయాలపై లోతుగా కసరత్తు చేయండి. పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమల ఏర్పాటులో ఏపీఐఐసీ పాత్ర కీలకం. మౌలిక సదుపాయాల కల్పనతో పెద్దపెద్ద కంపెనీలను తీసుకురావచ్చు. మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసింది. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి. కానీ మాజీ సీఎం జగన్ ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చారు. ఆర్టీసీని నిలబెట్టాలి. ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి. కార్గో పెంచాలి.


చిన్నస్థాయి నేతలకూ అవకాశం..

పెద్దస్థాయి నేతలకే కాదు ట్రాక్ రికార్డ్ ఆధారంగా చిన్నస్థాయి నేతలకూ కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించాం. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు మీకూ వస్తాయి. మనకు వచ్చిన విజయాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెర్స్ అని నేను, పవన్ కల్యాణ్ చెప్పాం. అదే అందరూ పాటించాలి. 15రోజుల్లో వరదసాయం అందించాం. బాధితులను నిలబెట్టే ప్రయత్నం చేశాం. ఇదీ మన విధానం. దీనికి అనుగుణంగా మీరూ పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సమన్వయంతో మీరంతా పని చేయాలని కోరుతున్నా. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి. ఆల్ ది బెస్ట్ అంటూ" చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..

Perninani: పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా.. పేర్ని సూటి ప్రశ్న

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

Updated Date - Sep 25 , 2024 | 08:36 PM