Share News

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ABN , Publish Date - Jan 17 , 2025 | 10:48 AM

CM Chandrababu: భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగు వారి సత్తాను చాటారని కొనియాడారు. క్రీడారంగంలో నితీశ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
CM Chandrababu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబును భారత యువ క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. సీఎం చంద్రబాబుతో నితీశ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. వీరి సమావేశంలో పలు కీలక విషయాలను సీఎం చంద్రబాబుకు నితీష్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


అయితే నితీశ్‌కుమార్‌రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. నితీశ్‌ సెంచరీ చేయడంతో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) రూ. 25 లక్షలు ప్రకటించింది. ఈ నగదును సీఎం చంద్రబాబు నితీశ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయడం అపురూపమైన అనుభవమని తెలిపారు. ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగువారి సత్తాను నితీశ్‌ ప్రపంచానికి చాటారని చంద్రబాబు ప్రశంసించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


క్రీడాకారులను ప్రోత్సాహిస్తాం: మంత్రి నారా లోకేష్

lokesh.jpg

అనంతరం మంత్రి నారా లోకేశ్‌తో కూడా నితీశ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలుగు వారి సత్తాను నితీశ్ కుమార్ రెడ్డి చాటారని లోకేష్ అన్నారు. తమ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని నారా లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..

AP NEWS: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2025 | 11:23 AM

News Hub