Home Minister Anitha: కేంద్రం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తాం
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:20 PM
Home Minister Anitha: సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. కేంద్ర హోం శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్‌కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సైబర్ సెక్యూరిటీ సంస్థలను నెలకొల్పుతామని చెప్పారు. పోలీస్ అకాడమీ(అప్పా) శాశ్వత భవనాల నిర్మాణానికి భూసేకరణ పూర్తి అయిందని అన్నారు. నేర నియంత్రణే లక్ష్యం..పోలీసుల వసతులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. జనవరి మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతామని చెప్పారు. పోలీసులకు అత్యాధునిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తునిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడంపైనా మాట్లాడారు. టెక్నాలజీ పెరుగుతూ నేర స్వరూపం మార్చుకుంటున్న నేపథ్యంలో పోలీసులకు తగిన శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోం శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్‌కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. ఈ సమీక్షకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి , ఐజీ విజయకుమార్, 'ఈగల్' చీఫ్ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబీ, గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడైర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఆ సంస్థలు ఏపీకి రావాలి: ఎంపీ కేశినేని శివనాథ్
రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌లు, జైళ్ల అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని..అలాగే రాష్ట్రానికి గ్రేహౌండ్స్, అప్పా సంస్థలు రావాల్సి ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి 118 సంస్థలు రావాల్సి ఉందని... ఈ అంశాలపై దృష్టి పెటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులు, రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను హోం మంత్రి అనిత రాష్ట్ర పోలీసు అధికారులతో కలుస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Perni Nani: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు
CP Rajasekhar: వార్షిక నేర సమీక్షను విడుదల చేసిన విజయవాడ సీపీ.. ఏం చెప్పారంటే
Read Latest AP News And Telugu News