Home » AP Volunteers
వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని అన్నారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై (Volunteer System) కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది...
ఏపీలో 2019-2024 మధ్య ఐదేళ్లపాటు వైసీపీ సర్కారు పాల్పడిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఏబీఎన్ ఎఫెక్టుతో తాజాగా మరో బాగోతం బయటపడింది.
వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తెలిపారు.వారి నుంచి పెద్దఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సప్ మెసేజ్లతో తన ఫోన్ నిండి పోయిందని చెప్పారు.
వలంటీర్లంతా రాజీనామా చేయాలని వైసీపీ (YSRCP) నేతలు ఒత్తిడి చేస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత పులివర్తి సుధారెడ్డి (Pulivarthi Sudhareddy) అన్నారు. శనివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రగిరిలో వలంటీర్లపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని.. దీంతో వారిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్లు వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు ఇచ్చారని మిగిలిన వారిని పట్టించుకోలేదని అన్నారు.
కాకినాడలోని నాగమల్లితోట జం క్షన్ సమీపంలో గురువారం వైసీపీకి చెందిన గుత్తుల సూర్యప్రకాశ్ వలంటీర్లతో సమావేశ మైనట్టు వచ్చిన సమాచారంతో కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ కార్యకర్తలతో కలసి వెళ్లి వలంటీర్లను నిలదీశారు.
09: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Andhrapradesh: ఏపీలో పింఛన్దారులకు నగదు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూకేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టేయడంతో వారితో రాజీనామాలు చేయించాలనే కొత్త నాటకానికి వైసీపీ తెర తీసింది. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి.
వలంటీర్ల(Volunteers) విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని.. వారికి ఎలాంటి అన్యాయం జరగదని తెలుగుదేశం (Telugu Desham Party) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. వలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగా వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందని తెలిపారు.
ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉందని మాజీ ఎస్ఈసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు వేశారని చెప్పారు.