AP News: వైసీపీ సర్కారులో జరిగిన మరో బాగోతం వెలుగులోకి
ABN , Publish Date - Jun 24 , 2024 | 04:38 PM
ఏపీలో 2019-2024 మధ్య ఐదేళ్లపాటు వైసీపీ సర్కారు పాల్పడిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఏబీఎన్ ఎఫెక్టుతో తాజాగా మరో బాగోతం బయటపడింది.
అమరావతి: ఏపీలో 2019-2024 మధ్య ఐదేళ్లపాటు వైసీపీ సర్కారు పాల్పడిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఏబీఎన్ ఎఫెక్టుతో తాజాగా మరో బాగోతం బయటపడింది. ఈ నెల వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది జీతంతో పాటు సాక్షి పేపర్ బిల్లుగా రూ.200తో కలుపుకొని మొత్తం రూ.5200 చొప్పున ప్రభుత్వ నిధుల నుంచి కట్ అయ్యింది. జీతంతో పాటు పేపర్ బిల్లును కూడా సీఎఫ్ఎంఎస్‌లో (CFMS) అప్‌లోడ్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బయటపెటింది.
దీంతో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు. సాక్షి పేపర్ బిల్లును జీతాల బిల్లుతో అప్‌లోడ్ చేయడం ఏమిటని కేబినెట్ భేటీలో కొంతమంది మంత్రులు ప్రశ్నించారు. దీంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. సాక్షి పేపర్ బిల్లులను అప్‌లోడ్ చేయడం నిలిపివేశామని సమాధానం ఇచ్చారు.
For more AP News and Telugu News