Apsara Murder Case : ABN చేతిలో అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..
ABN , First Publish Date - 2023-06-10T15:56:53+05:30 IST
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు (Apsara Murder Case) పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి..
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు (Apsara Murder Case) పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి. అప్సరను సాయికృష్ణ (Apsara-Sai Krishna) ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? హత్యకు ముందు ఏం జరిగింది..? హత్య తర్వాత అసలేం జరిగింది..? పోలీసు విచారణలో సాయి ఏం చెప్పాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఇప్పటికే పెను సంచలన విషయాలు బయటికి రాగా.. తాజాగా అప్సర హత్య రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ఎక్స్‌క్లూజివ్‌గా తెలుసుకుందాం.
రిమాండ్ రిపోర్టు యథావిధిగా..
‘గత ఏడాది ఏప్రిల్ నుంచి సాయికృష్ణ -అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సందేశాలు చేశాడు సాయి. నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. నవంబర్‌లో గుజరాత్ వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్ ద్వారా అప్సరకు సాయి లవ్ ప్రపోజ్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోమని అప్సర.. సాయిపై ఒత్తిడి తెచ్చింది. తనను పెళ్లి చేసుకోకపోతే సాయిని రోడ్డుకు ఈడుస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేసింది. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయి హత్య చేశాడు. హత్యకు వారం రోజుల ముందు How To Kil Human Being అని కొట్టి గూగుల్‌లో సాయి వెతికాడు. తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని పలుమార్లు సాయిని అప్సర కోరింది. అప్సరను చంపేందుకు కోయంబత్తూర్ టూర్‌ను అడ్డుపెట్టుకున్నాడు. జూన్-3న రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను సాయి నమ్మించాడు. ప్రియుడి మాటలు నమ్మి సరూర్‌నగర్ నుంచి కారులో అప్సర వెళ్లింది. అదే రోజు 8:15 గంటలకు సరూర్‌నగర్‌లో ఇద్దరూ కారులో బయల్దేరి వెళ్లారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని అప్సరతో చెప్పాడు. అక్కడి నుంచి గోశాలకు వెళ్తున్నట్లు అప్సరకు సాయి చెప్పాడు. డిన్నర్ కోసం రాల్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర సాయి కారు ఆపాడు. అప్పటికే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అప్సర వాంతులు చేసుకుంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. 12 గంటలకి సుల్తాన్‌పల్లిలో ఉన్న గోశాలకు చేరుకున్నారు. 3:50 గంటలకు వెంచర్ వైపు ఇద్దరూ వెళ్లారు. అప్సర నిద్రలో ఉండగా సాయి హత్య చేశాడు’ అని రిమాండ్ రిపోర్టులో ఉంది.