Apsara Parents: మా కూతురి తప్పేమీ లేదు

ABN , First Publish Date - 2023-06-10T13:34:01+05:30 IST

పూజారి సాయికృష్ణ చేతిలో అప్సర అతి కిరాతకంగా హత్యకు గురవడంపట్ల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Apsara Parents: మా కూతురి తప్పేమీ లేదు

హైదరాబాద్: పూజారి సాయికృష్ణ చేతిలో అప్సర అతి కిరాతకంగా హత్యకు గురవడంపట్ల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కూతురి తప్పేమీ లేదని.. సాయికృష్ణను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్సర పోస్ట్‌మార్టం జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.

అప్సర మృతి కలిచివేసిందన్న తండ్రి...

‘‘ఈ నెల 1న నా కూతురుతో మాట్లాడాను. తండ్రిగా అక్షరకు కావలసినవన్నీ సమకూర్చాను. డబ్బులు కూడా పంపించాను. ఇంతలోనే ఇంత దారుణ చోటు చేసుకోవడం మమ్మల్ని కలిచి వేసింది. మాకు సాయి కృష్ణకు ఎలాంటి బంధుత్వం లేదు. సాయి కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని అప్సర తండ్రి శ్రీకర్ డిమాండ్ చేశారు.

అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి: అప్సర తల్లి

‘‘మా కూతురు అప్సరను హత్య చేయడం దారుణం. మా కూతురు తప్పేమీ లేదు. మాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. మేము నిందితుడు సాయి వద్ద డబ్బు తీసుకోలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఏదయినా ఉంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. సాయి కృష్ణ మా ఇంటికి వచ్చేవాడు.. మాతో మాట్లాడేవాడు. అప్సర మిస్ అయిందని కంప్లెయింట్ ఇచ్చే ముందు... అతని బీహెబియర్లో చేంజ్ చూశాం’’ తల్లి అరుణ చెప్పుకొచ్చారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-10T13:37:00+05:30 IST