Home » APSRTC
భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
Andhrapradesh: మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మే 13వ తేదీన పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు.
సహజంగా.. పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. కానీ, ఏ పండుగా లేకున్నా.. ఇప్పుడు అలాంటి సందడే కనిపిస్తోంది. ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి పయనం కావడమే దీనికి కారణం.
Andhrapradesh: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో సెలబ్రెటీస్‌ను, ప్రముఖులను కూడా సైబర్ నేరగాళ్లు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేరారు. యూనిఫాంలో ఉన్న ఆయన ఫోటోతో, పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను కేటుగాళ్లు రూపొందించారు.
డబ్బులు, మద్యం, బిర్యానీ పంచారు. పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు, స్కూల్ బస్సులు కూడా తరలించారు. వైసీపీ నాయకులకు జనసమీకరణ టార్గెట్లు పెట్టారు. ఆర్థిక, అంగ బలాలతో పాటు ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగానికి తెగబడ్డారు. ఇంత చేసినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో వైసీపీ నిర్వహించిన దక్షిణ కోస్తాంధ్ర ‘సిద్ధం’ సభకు ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేకపోయారు.
Raptadu Siddam Sabha: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ‘సిద్ధం’ (Siddam) పేరిట భారీ బహిరంగ సభలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన సభలు ఏ మాత్రం సక్సెస్ అయ్యావో.. వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాయలసీమలో మొదటిసారి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ (Raptadu Siddam Sabha) సభలో ముఖ్యమంత్రికి ఊహించని షాకే తగిలింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు(Bangalore) నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 11 నుంచి 13 వరకు ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
నగరంలోని పండింట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లిన ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బస్టాండ్‌కు చేరుకున్న ఆయన.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
నెల్లూరు జిల్లా: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్, అతని అనుచరులను పట్టుకోలేకపోతున్నారు. సుధీర్ ఇంటి వద్దకు వెళ్లి, ఇంట్లోకి వెళ్లలేక డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, సుమారు 30 మంది పీసీలు వెనుదిరిగారు.
ఆర్టీసీ జనరల్ బాడీ వేరు.. చైర్మన్ వేరు అని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్‌కు ఇచ్చిన జీవోలో రెండు సంవత్సరాల కాల పరిమితి మాత్రమేనని ఎక్కడా లేదని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాసినట్టు ఉన్నారని.. జనరల్ బాడీకి మాత్రమే రెండు సంవత్సరాల కాల పరిమితి ఉందన్నారు.