Home » Army
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.
తైవాన్ (Taiwan)పై దాడికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడటానికి సిద్ధమేనని సైనికులు శపథాలు చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ ప్రసారం చేసింది. ఎనిమిది ఎపిసోడ్ల డాక్యుమెంటరీలో సైనికుల శపథాలను చూపించారు.
ఈద్ పండుగ జరుపుకోవడం కోసం ఇంటికి సెలవుపై వెళ్లిన సైనికుడు జావేద్ అహ్మద్ అనూహ్యంగా అదృశ్యమయ్యారు. జమ్మూ-కశ్మీరు లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్లో రైఫిల్మేన్గా పని చేస్తున్న ఆయన ఈ నెల 31న తిరిగి విధుల్లో చేరవలసి ఉంది. అయితే ఆయన శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన కారులో సమీపంలోని మార్కెట్కు వెళ్లారు.
మణిపూర్లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు.
దేశ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేసిన సైనికులను ఎంతో మందిని చూశాం. ఇంకొందరు ఆర్మీ ఉద్యోగులు పదవీ విరమణ చేసినా.. అంతే దేశ భక్తితో, అంతే నిజాయితీతో జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. ఒకప్పుడు..
సియాచిన్ గ్లేసియర్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించినవారి గురించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పాతికేళ్ల లోపు వయసుగలవారేనని, వీరు పాకిస్థాన్ జాతీయులని, భారత దేశంపై జీహాద్ (యుద్ధం) చేయడానికి వచ్చారని వెల్లడైంది.
భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో శుక్రవారం విప్లవాత్మక పరిణామం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యే విధంగా యుద్ధ విమానం ఇంజిన్ను సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.
దేశ సేవకు అంకితమైన కొడుకును చూసి తల్లి ఎంతో సంతోషించింది. మరోవైపు.. తనకు, పిల్లలకు దూరంగా ఉన్నా కూడా దేశం కోసం తన భర్త కష్టపడడం చూసి భార్య కూడా గర్వంగా ఫీలయ్యేది. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. అంతా ..
కడుపు కాలిపోతున్నా పాకిస్థాన్ దుర్మార్గపు బుద్ధిలో మార్పు రావడం లేదు. సొంతింటిని చక్కదిద్దుకోవడం కన్నా భారత దేశాన్ని ఇబ్బందులపాలు చేయడం కోసం సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటి వరకు కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోసిన ఆ దేశం ఇప్పుడు జమ్మూపై కన్ను వేసింది. తీవ్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి పంపిస్తోంది.