Monsoon Tracker: ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్, అరుణాచల్‌ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్
ABN , Publish Date - Jun 28 , 2024 | 07:44 PM
భారీ వర్షాలతో దేశ రాజధాని న్యూఢిల్లీ అతలాకుతలమవుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 28: భారీ వర్షాలతో దేశ రాజధాని న్యూఢిల్లీ అతలాకుతలమవుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఢిల్లీ, ఛండీగఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లో సైతం కొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ యా రాష్ట్రాల్లో అరంజ్ అలర్ట్‌ను వాతావరణ విభాగం జారీ చేసింది. జూన్ 29,30 తేదీల్లో ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాధారణ వర్షపాతం నమోదు కానుందని పేర్కొంది.
Political Tragedy: అయ్య బాబోయ్.. అచ్చుగుద్దినట్లుగా సేమ్ టు సేమ్..
ఈదురుగాలులు సైతం వీస్తాయని వెల్లడించింది. మరోవైపు రానున్న 5 రోజుల్లో గోవా, కొంకణ్, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్ 29, 30 తేదీల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. జూన్ 30 నుంచి జులై 1వరకు పంజాబ్‌లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే జూన్ 29 నుంచి జులై 1 వరకు హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీలలో భారీ వర్షం కురిసే అవకాశముందని వివరించింది.
AndhraPradesh: రాష్ట్రంలో మళ్లీ ఐపీఎస్‌లు బదిలీ
జూన్ 28 నుంచి జులై 1వ తేదీ వరకు గుజరాత్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌తోపాటు తూర్పు రాజస్థాన్‌లో సైతం భారీ వర్షపాతం నమోదు కానుందని వివరించింది. మధ్యప్రదేశ్, ఒడిశాలలో సైతం ఇదే తరహాలో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. జూన్ 28 నుంచి 30 వరకు సబ్ హిమాలయా ప్రాంతం పశ్చిమబెంగాల్, సిక్కింలలో సైతం భారీ వర్షం కురియనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాల్లో వచ్చే అయిదురోజుల్లో సాధారణ నుంచి భారీ వర్ష పాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మాత్రం అంతగా మార్పులు ఉండవని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది.
For AP News and Telugu News