Viral Video: గడ్డకట్టిన సరస్సుపై వాకింగ్.. సడన్‌గా మంచులో కూరుకుపోయిన పర్యాటకులు.. చివరకు..
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:41 PM
మంచు ప్రదేశాల్లో నదులు, సరస్సులు గడ్డ కట్టుకుపోవడం చూస్తుంటాం. ఆ దృశ్యాలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే గడ్డకట్టిన నీటిపై నడవడం కూడా వింత అనుభూతిని కలిగిస్తుంది. దీంతో చాలా మంది ఇలాంటి ప్రదేశాలను చూడటానికి వెళ్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ఈ తరహా..
మంచు ప్రదేశాల్లో నదులు, సరస్సులు గడ్డ కట్టుకుపోవడం చూస్తుంటాం. ఆ దృశ్యాలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే గడ్డకట్టిన నీటిపై నడవడం కూడా వింత అనుభూతిని కలిగిస్తుంది. దీంతో చాలా మంది ఇలాంటి ప్రదేశాలను చూడటానికి వెళ్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు పర్యాటకులు గడ్డకట్టిన నీటిపై నడుస్తుండగా ఉన్నట్టుండి మంచులో కూరుకుపోయారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మనాలి వంటి ప్రాంతాల్లో మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు (Minus degree temperature) నమోదవుతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తుండడంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
Viral Video: గాలిపటం ఎగురవేస్తున్న కోతి.. మేడపై దాని నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..
తాజాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విపరీతమైన మంచు కారణంగా స్థానికంగా ఉన్న సరస్సులు గడ్డ కట్టుకుపోయాయి. దీంతో ఈ ప్రాంతాలను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఓ సరస్సుపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గడ్డ కట్టుకుపోయిన సరస్సుపై కొందరు పర్యాటకులు నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి మంచు కరిగిపోయి నలుగురు పర్యాటకులు (Tourists stuck in snow) అందులో చిక్కుకుపోయారు. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయారు. కాపాడండి.. కాపాడండి.. అంటూ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
Viral Video: ప్రాణాలకు తెగించింది.. పక్షిలా మారింది... ఈ కోడి విన్యాసం చూశారంటే..
కర్రలు, తాళ్లు వారి వద్దకు విసిరేసి.. ఎలాగోలా వారిని ఒడ్డుకు లాక్కొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రదేశాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘సమయానికి స్పందించి వారి ప్రాణాలను కాపాడారు.. నిజంగా గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 7.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..