Home » Asia cup 2023
సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా సిరాజ్‌ను కొనియాడారు.
వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఊపు మీదున్న సిరాజ్‌కు మరో ఓవర్ ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. సిరాజ్‌కు మరో ఓవర్ ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడేవనేది వారి అభిప్రాయం. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టతనిచ్చాడు.
ఆసియా కప్‌ను తొలుత ఎత్తిన ఆటగాళ్ల జాబితాలో 20 ఏళ్ల తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అతి పిన్న వయస్కుడు లేదా కొత్త ఆటగాడు ఇతరుల కంటే ముందుగా ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈసారి తిలక్ వర్మకి ఈ అవకాశం వచ్చింది. అయితే ట్రోఫీని ఎత్తుకున్నవారిలో మరో కొత్త వ్యక్తి ఉన్నాడు. అతడు ప్లేయర్ కాదు.. కోచ్ లేదా ఫిజియో కాదు. ఆటగాడు లేదా కోచ్ కాకపోయినా జట్టులో అతడు చాలా ముఖ్యమైన సభ్యుడు. అతడే...
చిరుజల్లుల వేళ.. పిడుగులా విరుచుకుపడిన పేసర్ సిరాజ్.. ఐదేళ్ల తర్వాత భారత్‌కు ఆసియాకప్‌ను అందించాడు. ..
51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు 6.1 ఓవర్‌లోనే పూర్తి చేశారు. దీంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు 23 ఏళ్ల క్రితం శ్రీలంక చేతిలో ఎదురైన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
ఆసియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. అతిథ్య జట్టు శ్రీలంకతో ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 10 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించింది.
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి శ్రీలంకను చావు దెబ్బ తీశాడు.
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/21) విశ్వరూపించడంతో అతిథ్య జట్టు శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే నిప్పులు కక్కే బంతులతో రెచ్చిపోయిన సిరాజ్ శ్రీలంకను గజగజ వణికించాడు.
శ్రీలంకతో జరగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించాడు.
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో అతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక హెడ్స్ చెప్పాడు.