Home » Assam
ఐఐటీలో(IIT) చదువుతున్న ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో చేరి దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ఓ విద్యార్థి ఏకంగా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అంతే సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విద్యార్థి ఐఐటీ-గౌహతికి చెందిన ఓ విద్యార్థి(IIT-Guwahati student) కావడం విశేషం.
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా విదేశీ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో చేసిన ఆపరేషన్‌లో రూ.40 కోట్ల విలువైన 61 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అసోం పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించారు. సెంట్రల్ కోహురా రేంజ్లో గల మిహిముఖ్ ఏరియాలో ఏనుగు మీద ప్రధాని మోదీ సవారీ చేశారు. తర్వాత అక్కడే జీపులో సవారీ చేశారు. ప్రధాని మోదీతో పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్నీ రోజులు రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగనీయనని స్పష్టం చేశారు.
అస్సాంలో హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్‌కి (Uniform Civil Code) పెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను (Muslim Marriage Registration Law) నియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గత నెలలో అసోంలో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో రాహాల్ సహా 11 మంది కాంగ్రెస్ నేతలకు అసోం సీఐడీ తాజాగా సమన్లు జారీ చేసింది.
గౌహతిలో ఈరోజు(ఫిబ్రవరి 19న) ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించారు.
‘ప్రేమ’ అనేది ఎంతో పవిత్రమైంది. అదృష్టం ఉంటే తప్ప ఇది అందరికీ దక్కదు. కానీ.. ప్రస్తుత తరంలోని కొందరు యువతీ యువకులు దీనిని భ్రష్టు పట్టించేశారు. తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం ప్రేమ నాటకాలు ఆడుతున్నారు. ‘ప్రే’మించుకున్నామా.. ‘మ’రచిపోయామా అన్నట్టుగా యువత తయారైంది.
అసోం(assam)లో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు.