Home » Assam
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఆయనను పోలిన వ్యక్తిని గుర్తించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ తెలిపారు. యాత్రలోని కొన్ని ప్రాంతాల్లో రాహుల్‌ను పోలిన వ్యక్తిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరును బయటపెడతామని చెప్పారు.
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అసోంలో దుమారం రేపుతోంది. రాహుల్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తాజాగా రాహుల్‌ను అరెస్టు చేసి తీరుతామన్నారు.
అస్సాం ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) డిమాండ్ చేశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర(Barath Jodo Nyay Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసోంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన నాగావ్‌లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కావడంతోనే అసోం సీఎం భయపడి దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసోంలోని సునీత్‌పూర్ జిల్లా జుముగురిహాట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కారుపై పలువురు వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ అంటోంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) శనివారం కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్లే మియన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అసోం రాజధాని గౌహతిలో పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్ - మియన్మార్ మధ్య కంచె వేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ(Himanth Biswa Sarma) మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ అసోంలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
National: అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. అసోం ఒకప్పుడు మయన్మార్‌లో భాగంగా ఉండేదంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను శర్మ తోసిపుచ్చారు. అసోం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదన్నారు.
గురువారం ఉదయం అసోంలో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 42 నిమిషాల సమయంలో గౌహతిలో భూప్రకంపనలు సంభించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.