Share News

YS Sharmila:అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jan 22 , 2024 | 09:50 PM

అస్సాం ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) డిమాండ్ చేశారు.

YS Sharmila:అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి

విశాఖపట్నం: అస్సాం ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) డిమాండ్ చేశారు. సోమవారం నాడు విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ షర్మిల నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో న్యాయ యాత్రకు బీజేపీ నేతలు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అస్సాంలో రాహుల్ గాంధీపై దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. రాహుల్‌ను గుడికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల కోసం, ప్రశాంతంగా యాత్ర చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా.. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశంలో బీజేపీకి సపోర్టు చేసే పార్టీలు, వ్యక్తులు మాత్రమే ఉండాలా.. మరెవ్వరు ఉండకూడదా అని ప్రశ్నించారు. గుడికి వెళ్లడానికి కూడా మోదీ అనుమతి కావాలా అని నిలదీశారు. దేశంలో మోదీ నీచమైన పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపడుతున్నామని వైఎస్ షర్మిల అన్నారు.

Updated Date - Jan 22 , 2024 | 10:37 PM