Earthquake: అసోంలో భూకంపం.. తీవ్రత ఎలా ఉందంటే..?
ABN , First Publish Date - 2023-12-07T08:55:39+05:30 IST
గురువారం ఉదయం అసోంలో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 42 నిమిషాల సమయంలో గౌహతిలో భూప్రకంపనలు సంభించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గురువారం ఉదయం అసోంలో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 42 నిమిషాల సమయంలో గౌహతిలో భూప్రకంపనలు సంభించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా వెల్లడించింది. ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుతుండగా ఈ భూప్రకంపనలు సంభవించాయి. భూమి లోపల 5 కిలో మీటర్ల లోతులో 26.63 డిగ్రీల అక్షాంశం, 92.08 డిగ్రీల రేఖాంశం మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.