Home » Attack On TDP Office
వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీడీపీ (Telugu Desam) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది పెద్ద తలకాయలు మాత్రమే.. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ కాగా.. మరికొందరి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే.. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు...
అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇల్లు, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఎంపీ ఖండించారు.
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బద్దా వెంకన్న(Badda Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా..
మంగళగిరి(Mangalagiri) టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా... తాజాగా మరో ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella AppiReddy) అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బి నాయుడు, తియ్యగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు జరిపిన దాడిపై రెండున్నర సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది.