Home » Ayodhya Ram mandir
రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామంచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు.
దేశమంతటా రామ నామ స్మరణ మార్మోగుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటిని చూడ చక్కగా అలంకరించారు. ముంబయిలోని అంబానీ అధికారిక నివాసం యాంటిలియా ఆకర్షణీయమైన లైటింగ్‌తో చూపరులను కట్టిపడేస్తోంది.
అయోధ్యలో రామమందిర్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.
అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అట్టహాసంగా జరిగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.
అయోధ్య రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే(LK Advani) అద్వానీ హాజరుకాలేదు. అయోధ్య రామమందిర పోరాటంలో ఆయన రథసారథిగా నిలిచారు. అయితే అయోధ్యలో విపరీతమైన చలి గాలుల కారణంగా ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావట్లేదని తెలుస్తోంది.
అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం హాజరైన వారికి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదం పెట్టెను అందజేయనున్నారు.