Watch Video: రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 22 , 2024 | 01:10 PM
రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామంచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు.
అయోధ్య: రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలోని ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం శ్రీరామచంద్రుడి ఫోటోలు మొట్టమొదటిసారిగా బయటికి వచ్చాయి. దివ్యమైన రూపంతో భక్తులకు శ్రీరాముడు దర్శనమిచ్చాడు. రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు చెబుతున్నారు. కాగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ వెండి కిరీటం, పట్టువస్త్రాలను సమర్పించిన వీడియోను మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసేయండి.