Ram Mandir: అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్..అందులో ఏమున్నాయంటే
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:20 PM
అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం హాజరైన వారికి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదం పెట్టెను అందజేయనున్నారు.
అయోధ్య(Ayodhya) రామమందిర్(ram mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పాల్గొన్న ప్రత్యేక ఆహ్వానితులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రసాదం బాక్స్‌ను ఇవ్వనున్నారు. ఆలయ ట్రస్ట్ లక్నోలోని ప్రఖ్యాత స్వీట్ షాప్ ఛపన్ భోగ్ నుంచి 15,000 బాక్స్‌లను ఆర్డర్ చేసినట్లు నిర్వహకులు పేర్కొన్నారు. అయితే అందులో ఏడు రకాల వస్తువులు ఉంటాయని చెప్పారు. ఒక్కో బాక్సులో రెండు నేతి లడ్డూలు, గుర్ రెవ్డీ, రామ్దానా చిక్కీ, అక్షింతలు, రోలీ, తులసీ దళాలు, దీపపు కుందె, తీపి యాలకులు ఉంటాయని వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Ram Mandir: ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత సోమవారం ఆహ్వానితులకు ఈ 'ప్రసాదం' ప్రత్యేక పెట్టె అందిస్తారు. కుంకుమపువ్వు రంగులో ఉన్న ప్రసాదం పెట్టెకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, హనుమాన్ గర్హి లోగోలు ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించిన బ్యాగ్‌లో ఇస్తారు. దీంతో పాటు అతిథులకు మహా ప్రసాదం, దేశీ నెయ్యితో చేసిన ఆహారాన్ని కూడా అందిస్తారు. ఆలయ ట్రస్ట్ మార్గదర్శకత్వంలో గుజరాత్‌కు చెందిన భారతీ గర్వి గుజరాత్, సంత్ సేవా సంస్థాన్ ఈ ప్రసాదాన్ని తయారుచేశారు.