Home » Ayodhya Ram mandir
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) అనంతరం రామమందిర పరిసరాల్లో పర్యాటక రంగం ఊపందుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాములవారిని దర్శించుకుంటున్నారు.
అయోధ్యలో రామాలయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఈనెల 12వ తేదీ సోమవారంనాడు దర్శించనున్నారు. వీరు ఉభయులు తమ కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య రామాలయాన్ని దర్శించనున్నట్టు పార్టీ వర్గాలు అదివారం తెలిపాయి.
ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు ఆదివారం నాడు అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. ఉదయం లక్నో నుంచి బస్సుల్లో అయోధ్యకు బయలుదేరారు. స్టార్ట్ అయ్యే ముందు జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేశారు.
అయోధ్య రామమందిరంపై(Ayodhya Ram Mandir) శనివారం లోక్ సభలో చర్చ జరగనుంది. బీజేపీ(BJP) ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో అయోధ్యలోని రామమందిరంతో పాటు మధుర, కాశీ ఆలయాల ప్రస్తావన చేశారు. అయోధ్యలోని రామాలయం రాష్ట్రానికి ఎలాంటి గుర్తింపు తెచ్చిందో సభలో వివరించారు.
ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు. విమానం గాలిలో ఉండగానే రామ భజన చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య(Ayodhya) రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడుతున్నాడని భక్తులు అంటున్నారు.
దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.
అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.