Home » Balineni Srinivasa Reddy
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ వీడేందుకు దాదాపుగా సిద్దమైనట్లు సమాచారం. అందులోభాగంగా ఒంగోలులోని తన వైసీపీ కార్పొరేటర్లు, తన ముఖ్య అనుచరులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ వీడకుండా బాలినేని ఉండేందుకు మాజీ మంత్రి విడదల రజినీని మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దింపారు.
ఓటమి భారంతో ఆపసోపాలు పడుతున్న ప్రకాశం జిల్లా వైసీపీలో సరికొత్త సంక్షోభం ఏర్పడింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు పార్టీలో పదవులొద్దని.. అసలే పనీ చేయలేనని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కే తేల్చిచెప్పారు.
వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. తానే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నానని అన్నారు. తనను పార్టీ పట్టించుకోకపోవడమే..
మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పార్టీలో కూడా ఇబ్బందులు పడ్డా.. కొంతమంది బయటి వ్యక్తులతో కలసి మా వాళ్లే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా’’ అని అన్నారు.
వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మానసికంగా బ్యాలెన్స్ తప్పారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు(MLA Janardhana Rao) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరుతున్నారంటూ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి నేటి వరకూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఘోర పరాజయంతో సతమతం అవుతున్న జగన్‌కు(YS Jagan).. సొంత పార్టీ నేతల అసమ్మతి మరో తలనొప్పిగా మారింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy). ‘నాయకులకు మా జిల్లా ఏమైనా గొడ్డు పోయిందా?..
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..