Share News

Balineni Vs Damacharla: కౌంటింగ్ రోజు పారిపోయి ఇప్పుడొచ్చి నీతులా..?

ABN , Publish Date - Jul 15 , 2024 | 09:00 PM

వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మానసికంగా బ్యాలెన్స్ తప్పారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు(MLA Janardhana Rao) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

Balineni Vs Damacharla: కౌంటింగ్ రోజు పారిపోయి ఇప్పుడొచ్చి నీతులా..?

ప్రకాశం: వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మానసికంగా బ్యాలెన్స్ తప్పారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు(MLA Janardhana Rao) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ రోజు కొడుకుతో సహా పారిపోయిన ఆయన ఇవాళ ఒంగోలు తిరిగి వచ్చి పెద్ద నిజాయితీ పరుడిలాగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Home Minister Anitha: ఆ కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ.." ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో బాలినేని కుటుంబ సభ్యులు అరాచకం సృష్టించారు. బాలినేని కోడలు కూడా దాడులు చేశారు. టీడీపీ మహిళా కార్యకర్తని బాలినేని దగ్గరుండి మరీ కొట్టించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఓడిపోతామని తెలిసే తండ్రికొడుకు ఎటో పారిపోయారు. ఇవాళ ఒంగోలుకు వచ్చి నీతులు చెబుతున్నారు. వైసీపీ మంత్రిగా బాలినేని ఉన్నప్పుడే వారిని నేను ఎదిరించా. మరోసారి అదుపుతప్పి మాట్లాడితే సహించేది లేదు. శ్రీనివాసరెడ్డి చేసిన పాపాలకి ప్రజలే బుద్ధి చెప్పారు.

Bhupathi Raju: కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తేలడం లేదు..


బాలినేని వియ్యంకుడు విల్లాల నిర్మాణంలో అవినీతి జరిగింది. అధికారులతో కమిటీ వేసి అవినీతి తేలుస్తాం. విల్లాల కోసం బలవంతంగా భూములు రాయించుకున్నారు. కార్యకర్తల్ని వదిలేసి బాలినేని ఆడుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. ఆయన పని అయిపోయిందని ఆరు నెలల క్రితమే చెప్పా. ఎన్నికల సమయంలో టీడీపీలోకి వస్తానని బాలినేని అడిగితే చంద్రబాబు తిరస్కరించారు. రెండ్రోజుల క్రితం కూడా జనసేనలో చేరేందుకు ఆయన చర్చలు జరిపారు" అని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Krishna water: కృష్ణా జలాలపై విచారణ ఆగస్టు 28, 29తేదీలకి వాయిదా..

Updated Date - Jul 15 , 2024 | 10:03 PM