Home » Bandaru Satyanarayana Murthy
విశాఖ: కేంద్రమంత్రులుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu), గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (MP Pemmasani Chandrasekhar).. ఢిల్లీలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో వారిపై టీడీపీ, జనసేన, భాజపా కూటమి నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)ని వీడి వైఎస్సార్‌సీపీ (YSRCP)లోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చిన వాటిని తిరస్కరించానని.. టీడీపీలోనే కొనసాగుతానని బండారు స్పష్టం చేశారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్లు రాక మరొక పార్టీలో చేరిపోవడానికి కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. టీడీపీ విషయానికొస్తే..
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఆకస్మాతుగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతోపాటు బీపీ పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
TDP To YSR Congress: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు ఇటు జంప్ అవుతుండగా.. అభ్యర్థుల జాబితా.. ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు..