AP Elections 2024: బండారు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా..?
ABN , Publish Date - Mar 18 , 2024 | 02:40 PM
TDP To YSR Congress: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు ఇటు జంప్ అవుతుండగా.. అభ్యర్థుల జాబితా.. ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు ఇటు జంప్ అవుతుండగా.. అభ్యర్థుల జాబితా.. ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. కాగా.. గత రెండ్రోజులుగా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) పార్టీని వీడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయ్. దీంతో ఒక్కసారిగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. దీంతో నిజంగానే బండారు పార్టీ మారుతున్నారా..? అనే విషయంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా క్లియర్ కట్‌గా తన మససులోని మాటను బయటపెట్టారు.
Big Breaking: కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల!
బండారు ఇంతకీ ఏం చెప్పారు..?
‘నేను పార్టీ వీడుతున్నానని వస్తున్న వార్తలను మీడియాలో చూస్తున్నాను. ఈ వార్తలపై నా సమాధానం ‘నో’ కామెంట్స్ అంతే. కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులతో చర్చలు జరుపుతున్నాను. వారి అభిప్రాయాలను తీసుకుంటాను. ఆపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. రెండు, మూడు రోజుల్లో మీడియా మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని తన సత్యనారాయణ ఏబీఎన్‌కు చెప్పారు. అయితే.. వైసీపీ నుంచి బండారుకు పిలుపు వచ్చిందని.. ముఖ్యనేతలు కొందరు టచ్‌లోకి వెళ్లగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే తెలుస్తోంది.
అసలేం జరిగింది..?
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో భాగంగా ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు కాసింత అసంతృప్తికి లోనవుతున్నట్లుగా తొలి, రెండో జాబితా రిలీజ్ చేసిన తర్వాత వార్తలు వచ్చాయి. దీంతో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో వైసీపీ ఉందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని.. ఈయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా సైకిల్ దిగుతారని టాక్ నడుస్తోంది. అయితే బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశాఖలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతో చూడాలి మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి