Share News

AP Politics: నాకు వైసీపీ నుంచి ఆఫర్లు.. మాజీ మంత్రి బండారు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 30 , 2024 | 03:07 PM

గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)ని వీడి వైఎస్సార్‌సీపీ (YSRCP)లోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చిన వాటిని తిరస్కరించానని.. టీడీపీలోనే కొనసాగుతానని బండారు స్పష్టం చేశారు.

AP Politics: నాకు వైసీపీ నుంచి ఆఫర్లు.. మాజీ మంత్రి బండారు కీలక వ్యాఖ్యలు

అనకాపల్లి జిల్లా: గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)ని వీడి వైఎస్సార్‌సీపీ (YSRCP)లోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చిన వాటిని తిరస్కరించానని.. టీడీపీలోనే కొనసాగుతానని బండారు స్పష్టం చేశారు. ‘నా కట్టే కాలేంతవరకు నేను పసుపు జెండా మోస్తూనే ఉంటా.. నా చితి మీద పసుపు జెండా వేసి కాల్చాలి’ అని అన్నారు. శనివారం నాడు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెందుర్తి ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించినా దగ్గర నుంచి నేటి వరకు పార్టీ కోసం చాలా ఉద్యమాలు చేశానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి తాను ఏ పాపం చేశానని సీటు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.45 ఏళ్లు సుదీర్ఘంగా పార్టీ కోసం కష్టపడిన తాను ఏ రోజు పార్టీకి అన్యాయం చేయలేదని వాపోయారు.

TG Politics: కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!

పార్టీలు మారినా నేతలకు పెందుర్తి సీటుని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. 26 రోజులుగా తనకు నిద్ర లేదని.. తనను టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా కొంతమంది నేతలు అడ్డుకున్నారని చెప్పారు. తనకు సీటు కేటాయించకపోయినా పర్వాలేదన్నారు. కానీ తాను పార్టీ మారుతున్నానని దుష్పచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. టీడీపీ కోసం తాను వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేశానని గుర్తుచేశారు. తనపై జగన్ ప్రభుత్వం 11 కేసులు పెట్టిన భయపడలేదని చెప్పారు. టీడీపీ తనకు ఏ రోజు పదవులు ఇవ్వలేదన్నారు. తాను పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉన్నానే తప్ప పార్టీకి దోహ్రం చేయలేదని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని బండారు సత్యనారాయణ మూర్తి ధీమా వ్యక్తం చేశారు.

KA Paul: నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు.. 7 రోజులు టైం ఇస్తున్నా..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 03:07 PM