Home » Bandi Sanjay Kumar
Telangana: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటు వేశారు. సోమవారం ఉదయం కరీంనగర్ జ్యోతినగర్‌లో కుటుంబ సభ్యులతో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉందన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రత డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదలిపెడతారు? ఎందుకు ఆయన్ను జైల్లో వేయలేదు? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.
అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కరీంనగర్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడైనా రాముడిని బీజేపీ నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని చెప్పారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని, నిరూపించకపోతే ఆ పార్టీ అభ్యర్థులంతా వైదొలుగుతారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు.
మంగళవారం కరీంనగర్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) రైతు దీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, రూ.500 బోనస్ హామీలను నేరవేర్చాలని దీక్షలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.
హైదరాబాద్: ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు.. పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలోనూ నేతల కప్పదాట్లు సహజంగా మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీకి..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..
కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పేందని ప్రశ్నించారు.