Share News

Bandi Sanjay Kumar: కేసీఆర్‌.. దేశద్రోహి..

ABN , Publish Date - May 12 , 2024 | 04:31 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ దేశ ద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్‌ వద్ద ఉన్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రత డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదలిపెడతారు? ఎందుకు ఆయన్ను జైల్లో వేయలేదు? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.

Bandi Sanjay Kumar: కేసీఆర్‌.. దేశద్రోహి..

  • ఇంటెలిజెన్స్‌ డేటాను ధ్వంసం చేయించారు

  • ఆయన్ను కాంగ్రెస్‌ సర్కార్‌ అరెస్టు చేయలేదేం?

  • నన్ను ఓడించేందుకు ఏ, బీ, సీ గ్యాంగ్‌ కుట్ర

  • నేను ఓడిపోతే హిందూత్వపై నోరెత్తను

  • లేదంటే బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ మూసేస్తారా?

  • స్ట్రైక్స్‌ చేసిన జవాన్లను సీఎం అవమానించారు

  • కాంగ్రెస్‌కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డే: బండి

  • కరీంనగర్‌, సిరిసిల్లలో బీజేపీ బైక్‌ ర్యాలీలు

  • ఈ ఎన్నికలు దేనికి రెఫరెండం?

  • కాంగ్రెస్‌ అవినీతికా? ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌కా ?

  • కేసీఆర్‌ లాగే రేవంత్‌ ప్రమాదకారి: కిషన్‌రెడ్డి

  • నన్ను ఓడించేందుకు ఏ,బీ, సీ గ్యాంగ్‌ ఒక్కటైంది

  • కాంగ్రె్‌సకు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డే: బండి సంజయ్‌

కరీంనగర్‌/సిరిసిల్ల, మే 11(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ దేశ ద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్‌ వద్ద ఉన్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రత డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదలిపెడతారు? ఎందుకు ఆయన్ను జైల్లో వేయలేదు? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌.. నేను హిందూ ఓటుబ్యాంకుతో పక్కాగా గెలువబోతున్నా.. ఒక వేళ నేను ఓడిపోతే హిందూత్వం గురించి మాట్లాడను.. కాషాయ జెండాను పట్టుకోను.. మీ అభ్యర్థి ఓడిపోతే మతం మార్చుకొని బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ చేసి ఫాంహౌజ్‌కు వెళ్లిపోవాలి. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ విధానాల వల్ల 1950 నుంచి 2015 వరకు భారత్‌లో హిందువుల జనాభా 8శాతం తగ్గితే, ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందని తెలిపారు. కరీంనగర్‌, సిరిసిల్లలో శనివారం వేలాది మంది స్వచ్ఛందంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.


ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ మోదీ మళ్లీ ప్రధాని కావాలని, తాను మళ్లీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తనను ఓడించేందుకు ఏ(అసదుద్దీన్‌), బీ(బీఆర్‌ఎస్‌), సీ(కాంగ్రెస్‌) గ్యాంగ్‌ ఒక్కటైంది. కానీ, నా వెనుక సాక్షాత్తూ శ్రీరాముడు, హిందూ సమాజం, మోదీ ఉన్నారు. ఎన్ని గ్యాంగ్‌లు వచ్చినా నన్నేమీ చేయలేవు’’ అని స్పష్టం చేశారు. ముస్లింలంతా ఒక్కటై సంజయ్‌ను ఓడించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారని, దీనిపై హిందువులందరూ స్పందించాలని కోరారు. ‘‘మీ కోసం నేను కొట్లాడిన. నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికుల కోసం జైలుకు పోయిన. కరీంనగర్‌ అభివృద్ధి కోసం రూ. 12వేల కోట్లు తీసుకువచ్చిన’’ అని వివరించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయనడానికి ఆధారాలున్నాయా? అంటూ దేశ జవాన్లను రేవంత్‌ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను సమర్ధించే ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని సూచించారు.


బీజేపీ.. క్యాన్సర్‌ లాంటిదన్న రేవంత్‌ వ్యాఖ్యలపై సంజయ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అవినీతి రోగానికి ప్రపంచంలో ఎవరూ మందు కనిపెట్టలేదని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటేస్తే ఆ రోగమంతా అంటుకుంటుందని, ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ‘‘గాడిద గుడ్డు పెట్టదు.. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ అమలు చేయదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మిగిలేది గాడిదగుడ్డే. ఆ గుర్తునే పట్టుకుని రేవంతన్న తిరుగుతున్నరు’’ అని విమర్శించారు. సీఎం పదవి కోల్పోయిన కేసీఆర్‌.. చిలుక జోస్యం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని అవుతానని ఇంకా కలలు కంటున్నారని, అసలు ఆ పార్టీకి ఒక్క సీటూ రాదని తేల్చిచెప్పారు. కరీంనగర్‌ నుంచి సంజయ్‌కు బంపర్‌ మెజారిటీ ఖాయమని ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

Updated Date - May 12 , 2024 | 04:31 AM