Home » Bandi Sanjay
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని కేంద్రమంత్రివర్గంలో తీసుకోవడంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇటీవల ఆ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు.
కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నగరంలోకి అడుగుపెట్టిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను గ్రూప్-1 అభ్యర్ధులు కలిశారు. గ్రూప్-1 మెయిన్స్ కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు కోరారు. నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు తెలిపారు.
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలకనుంది.
గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఈరోజు(మంగళవారం) తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా నగరానికి వస్తున్న జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్(G. Kishan Reddy, Bandi Sanjay)లకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు తెలిపారు.
హైదరాబాద్: కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌లు బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ బీజేపీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వారు తెలంగాణకు వస్తున్నారు.
గత ప్రభుత్వం చేసిన విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను మాజీ సీఎం కేసీఆర్ తప్పుబట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంజయ్‌కు విద్యారణ్య భారతి స్వామిజీ ఆశీస్సులు అందించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గురువారం ఉదయం 10.35 నిమిషాలకు బాధ్యతలు చేపట్టనున్నారు. నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భద్రతా కారణాల వల్ల కార్యకర్తల హడావిడి, నాయకుల సందడి లేకుండా సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.