Share News

BJP Leader's : ‘సెల్యూట్‌ తెలంగాణ’ ర్యాలీ!

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:04 AM

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలకనుంది.

BJP Leader's : ‘సెల్యూట్‌ తెలంగాణ’ ర్యాలీ!

నేడు కిషన్‌రెడ్డి, సంజయ్‌కు బీజేపీ శ్రేణుల స్వాగతం

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలకనుంది. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వరకు ‘సెల్యూట్‌ తెలంగాణ’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేటలో ర్యాలీ ప్రారంభమై.. రసూల్‌పురా, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, వైఎంసీఏ, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌, ఆబిడ్స్‌ సర్కిల్‌, నాంపల్లి రైల్వే స్టేషన్‌ మీదుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎం.రఘునందన్‌రావు, నగేశ్‌, ధర్మపురి అర్వింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను కూడా సన్మానించనున్నారు. అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Updated Date - Jun 20 , 2024 | 05:04 AM