Home » Bandi Sanjay
Telangana: అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి స్పష్టం చేయగా.. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు.
Telangana: అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎంపీ బండిసంజయ్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాహిత యాత్రలో ఎంపీ మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్టు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వెందుకు మీదేసుకుంటున్నావు.
Telangana: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ కూడలిలో ఈరోజు (మంగళవారం) బండి సంజయ్ పాదయాత్ర జరుగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Bandi Sanjay Prajahita Yatra: బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట(Siddipet) చేరుకోగా.. అక్కడ కాంగ్రెస్(Congress) శ్రేణులకు, బీజేపీ(BJP) శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు.
Telangana: ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా కొహెడ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్‌కు ఏం చేశానో తనను అనే ముందు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో పొన్నం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
కరీంనగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని.. బీజేపీని ఓడించేందుకే ఆ రెండు పార్టీల కుట్రలు చేస్తున్నాయని.. అసలు విషయం ఏంటో ప్రజలకు తెలుసునని.. మాకు పోటీ కాంగ్రెస్‌తోనేనని.. బీఆర్ఎస్ది మూడో స్థానమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు వెళ్లనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల తదితరులు సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో బీజేపీ నేతలు చర్చించనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది. హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో లిస్ట్ రెడీ చేయనున్నారు.
Telangana: రాంజీగోండు స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధుల కోసం ప్రభుత్వం కేటాయించడం సిగ్గు చేటంటూ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరుల మర్రి వద్ద బండి మీడియాతో మాట్లాడుతూ.. ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర బీఆర్ఎస్ చేసిందని.. చరిత్రను తెరమరగు చేయాలనుకున్న బీఆర్ఎస్ సర్కార్‌నే ప్రజలు కనుమరుగు చేశారన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు.