Share News

Bandi Sanjay: బీఆర్‌ఎస్ లాగే కాంగ్రెస్ చరిత్ర తెరమరుగు కాక తప్పదు..

ABN , Publish Date - Feb 21 , 2024 | 04:04 PM

Telangana: రాంజీగోండు స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధుల కోసం ప్రభుత్వం కేటాయించడం సిగ్గు చేటంటూ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరుల మర్రి వద్ద బండి మీడియాతో మాట్లాడుతూ.. ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర బీఆర్ఎస్ చేసిందని.. చరిత్రను తెరమరగు చేయాలనుకున్న బీఆర్ఎస్ సర్కార్‌నే ప్రజలు కనుమరుగు చేశారన్నారు.

Bandi Sanjay: బీఆర్‌ఎస్ లాగే కాంగ్రెస్ చరిత్ర తెరమరుగు కాక తప్పదు..

నిర్మల్, ఫిబ్రవరి 21: రాంజీగోండు స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధుల కోసం ప్రభుత్వం కేటాయించడం సిగ్గు చేటంటూ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరుల మర్రి వద్ద బండి మీడియాతో మాట్లాడుతూ.. ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర బీఆర్ఎస్ (BRS) చేసిందని.. చరిత్రను తెరమరగు చేయాలనుకున్న బీఆర్ఎస్ సర్కార్‌నే ప్రజలు కనుమరుగు చేశారన్నారు. వెయ్యి ఉరుల మర్రి స్మారక ప్రాంతాన్ని మరో చోటుకు మార్చాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎక్కడ మర్రి ఉందో అక్కడే రాంజీ స్పూర్తి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాంతాన్ని రాంజీగోండు స్పూర్తి కేంద్రంగా మారుస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లారా… వేయి ఉరుల చరిత్రను మతం కోణంలో చూడొద్దు అంటూ హితవుపలికారు. ఓట్ల కోసం వివాదాస్పదం చేయాలనుకుంటే బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ చరిత్ర కూడా తెరమరుగు కాక తప్పదు అని బండి సంజయ్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 21 , 2024 | 04:06 PM