Bandi Sanjay: ఆ ఇద్దరికీ పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని..
ABN , Publish Date - Feb 26 , 2024 | 02:39 PM
Telangana: ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా కొహెడ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్‌కు ఏం చేశానో తనను అనే ముందు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో పొన్నం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 26: ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) వ్యాఖ్యలు చేశారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా కొహెడ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్‌కు ఏం చేశానో తనను అనే ముందు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో పొన్నం చెప్పాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి రూ.697.87 కోట్లు తెచ్చానని తెలిపారు. పేదోళ్లకు కరోనా వాక్సిన్ ఉచితంగా ఇచ్చామన్నారు.
అలా అడగడం తప్పా...
‘‘రాముడు అయోధ్యలోనే జన్మించాడని గ్యారంటీ ఏందని అడిగేటోళ్లను.. మీరు మీ అమ్మ కే పుట్టారని గ్యారంటీ ఎందనీ అడిగినా.. తప్పా ? అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు ఇస్తానన్నారు.. రైతు రుణమాఫీ అమలు చేశారా? ఉచిత సిలిండర్లు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారా ? నా మీద 100 కేసులు పెట్టిండ్రు.. కేసీఆర్ సర్కారు అక్రమాలపై కొట్లాడింది నేను.. 150 రోజుల పాటు ప్రజల కోసం ఎండనక, వాననక, చలినక పాదయాత్ర చేసిన. కేసీఆర్‌ను గద్దె దించినది మేము.. కొట్లాడింది మేమైతే, మీరు కాంగ్రెస్‌కు ఓటేశారు..! పేదల కోసం మనం కొట్లాడినా మనకు ఓట్లు వేయలేదు.. కాంగ్రెస్ కొట్లాడకున్నా ఓట్లు వేశారు.. మనం ప్రజల కోసం ఎందుకు కొట్లాడాలి అని మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు.. ఇంక 20 రోజుల్లో అన్నీ అమలు చేయాలి. అయితే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండడంతో మళ్ళీ ఆరు గ్యారంటీలకు మంగళం. రామమందిరం మేము కట్టినం చెప్పుకుంటాం.. మీరు బాబ్రీ మసీదును కడతామంటే చెప్పుకోండి. ఎవరు వద్దన్నారు. ఇవి దేశానికి, మోదీకి సంబంధించిన ఎన్నికలు.. మోదీ ప్రధాని కావల్నా, లేక రాహుల్ కావాల్నా. మోదీని ప్రధాని చేయకుంటే మందిరం పోయి మసీదు వస్తది.. ప్రజలే తేల్చుకోవాలి’’ అంటూ బండిసంజయ్ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..