Home » Bangalore
బెంగళూరు బీటీఎం లే-ఔట్లో ఒక మహిళ వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. రోడ్డు పక్కన ఉన్న దుకాణం ముందు ఒక మహిళ నిల్చుని ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అటుగా ఓ కారు రయ్‌మని దూసుకొచ్చింది. దుకాణం ముందు ఉంచే సామాన్ల మీదుగా మెరుపు వేగంతో వెళ్లిపోయింది.
ప్రేమికులంతా వారి ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం కొందరు తమ తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోతుంటారు. మరికొందరు ఇష్టపడిన వారితో సహజీవనం చేయడం, అనంతరం వివాహాలు చేసుకోవడం చేస్తుంటారు. అయితే...
కర్ణాటకలోని దావణగెరె సబ్ జైలు నుంచి ఒక రేప్ కేసు నిందితుడు తప్పించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్ట్ 26న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 40 అడుగుల ఎత్తైన సబ్ జైలు గోడ దూకి నిందితుడు పారిపోతున్న ఘటన కలకలం రేపింది.
చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా ఇండియా చరిత్రకెక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 సక్సెస్ భారతీయులను గర్వపడేలా చేసిందని.. దీంతో ఆ ప్రయోగం విజయవంతమైన ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించి.. ఈ ఘనత సాధించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమ్మని కబురు దేశ ప్రజలకు అందించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌కు, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంతో(MOX-ISTRAC) కమ్యూనికేషన్ లింక్ ఏర్పడినట్లు ట్విటర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతేకాదు.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను కూడా ట్విటర్లో పోస్ట్ చేసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని కడుగోది ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో విగత జీవులుగా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రాణాలు తీసుకున్న ఈ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పెళ్లైన కొత్తలో భార్యను సంతోషంగా చూసుకునే చాలా మంది భర్తలు.. రాను రాను అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు చెడు అలవాట్లకు బానిసలై కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడితే.. మరికొందరు అనుమానం పెంచుకుని భార్యలను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇటీవల...
ఇంటర్నెట్ అందుబాటు లేని రోజుల్లో వివాహ సంబంధాలు కుదుర్చుకునేందుకు చాలా మంది పెళ్లిళ్ల బ్రోకర్లను సంప్రదించేవారు. వధూవరుల ఫొటోలను ముందుంచుతూ నచ్చిన అమ్మాయితో వివాహం కుదిర్చేవారు. కానీ ఇప్పుడలా కాదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..
బెంగళూరులో ఓ యువకుడు ఉన్నత చదువు అభ్యసించేందుకు వెళ్లాడు. అక్కడ నివసించేందుకు ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఎంత తిరిగినా తనకు సరైన ఇల్లు దొరక్కపోవడంతో ఓ బ్రోకర్‌కు మెసేజ్ చేశాడు. ఇంటి ఓనర్ తన ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఓ కండీషన్ పెట్టాడని.. 12వ తరగతిలో 90 శాతం మార్కులు రావాలని చెప్పాడని బ్రోకర్ ఇచ్చిన సమాధానంతో సదరు యువకుడు బిత్తరపోయాడు.
ప్రేమలో విఫలమయ్యామని కొందరు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరికొందరు, ఉపాధ్యాయులు తిట్టారని ఇంకొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలను తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, బెంగళూరులో ఓ విద్యార్థి కాలేజీ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే...