Auto Driver: ఈ ఆటో డ్రైవర్ దెబ్బకు.. ఆ కంపెనీయే దివాళా తీసేట్టుందిగా.. ఆటో వెనుక అసలేం రాశాడో చూస్తే..!
ABN , First Publish Date - 2023-11-23T18:50:28+05:30 IST
‘‘నన్ను చూసి ఏడువకురా’’, ‘‘ఏడువకురా అప్పు చేసి కొన్నా’’, ‘‘నీ ఏడుపే నా ఎదుగుదల’’.. ఇలాంటి కొటేషన్స్ వింటే ఎవరికైనా టక్కున ఆటోలే గుర్తుకొస్తాయి. ఆటో డ్రైవర్లు వాహనం వెనుక భాగంలో వింత వింత కొటేషన్లు రాయడం సర్వసాధారణమే. అయితే వీటిలో కొన్ని...
‘‘నన్ను చూసి ఏడువకురా’’, ‘‘ఏడువకురా అప్పు చేసి కొన్నా’’, ‘‘నీ ఏడుపే నా ఎదుగుదల’’.. ఇలాంటి కొటేషన్స్ వింటే ఎవరికైనా టక్కున ఆటోలే గుర్తుకొస్తాయి. ఆటో డ్రైవర్లు వాహనం వెనుక భాగంలో వింత వింత కొటేషన్లు రాయడం సర్వసాధారణమే. అయితే వీటిలో కొన్ని కొటేషన్లు ఆలోచింపజేస్తే.. మరికొన్ని కొటేషన్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే ఇంకొన్ని అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇలాంటి ఆటోలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఆటోకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఆటో డ్రైవర్ వాహనం వెనుక రాసిన సందేశం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ ఆటోను చూసిన వారంతా ‘‘ఈ ఆటో డ్రైవర్ దెబ్బకు.. ఆ కంపెనీయే దివాళా తీసేట్టుందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో బెంగళూరుకు చెందిన ఓ ఆటోకు (Bangalore Auto) సంబంధించిన ఫొటోలు (Viral photo) తెగ వైరల్ అవుతున్నాయి. నగరంలోని రద్దీ ప్రదేశంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ ఆటో ఆగి ఉంది. అయితే ఆటో వెనుక రాసిన సందేశం చూసి (Auto Quotation) అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘‘చెత్త వాహనం.. ఎవరూ ఇలాంటి ఆటోను కొనకండి’’.. అని రాశాడు. తన సొంత వాహనం బాగోలేదంటూ ఏకంగా వెనుక వైపు రాయడాన్ని చూసి అంతా ఆశ్చర్య వ్యక్తం చేశారు. చాలా మంది ఈ ఆటోను ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ ఫొటోను పీక్ బెంగళూరు మూమెంట్.. అని పిలుస్తున్నారు.
చాలా మంది ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేస్తున్నారు. ఆశిష్ క్రుపాకర్ అనే వ్యక్తి ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ‘‘బాగాలేని ఈ వాహనాన్ని కొనొద్దంటూ.. తన సొంత ఆటో గురించి చెప్పడం నిజంగా గ్రేట్’’.. అని ప్రస్తావించాడు. ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ డ్రైవర్ ప్రజాసేవ చేస్తున్నాడు’’.. అని కొందరు, ‘‘ఇలా రాయడానికి ఎంతో గొప్ప మనసు ఉండాలి’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోలకు బ్యాటరీ సామర్థ్యం సరిగ్గా ఉండదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 46 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Snake Woman: పాములంటే ఇంత ఇష్టమేంటి తల్లీ.. 16 ఏళ్ల వయసు నుంచే ఈ యువతి ఏం చేస్తోందంటే..!