Share News

Viral: ఈ ఒక్క ఫొటో.. ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోందిగా.. బైక్ వెనుక కూర్చున్న ఈ కుర్రాడు పేపర్ హెల్మెట్‌ను పెట్టుకోవడంతో..!

ABN , First Publish Date - 2023-11-15T16:53:42+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన చోటు చేసుకున్నా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఇక కాస్త విభిన్నంగా ఉంటే మాత్రం తెగ వైరల్ అవుతుంటుంది. ఇటీవల యువతీయువకులు బైకుల్లో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. కొందరు...

Viral: ఈ ఒక్క ఫొటో.. ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోందిగా.. బైక్ వెనుక కూర్చున్న ఈ కుర్రాడు పేపర్ హెల్మెట్‌ను పెట్టుకోవడంతో..!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన చోటు చేసుకున్నా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఇక కాస్త విభిన్నంగా ఉంటే మాత్రం తెగ వైరల్ అవుతుంటుంది. ఇటీవల యువతీయువకులు బైకుల్లో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. కొందరు బైకులపై విచిత్ర విన్యాసాలు చేయడం సర్వసాధారణమైంది. ఇలాంటి వారిని చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఒకే ఒక్క ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బైకు వెనుక కూర్చున్న కుర్రాడు పేపర్ హెల్మెట్ పెట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.

బెంగళూరులో (Bangalore) చోటు చేసుకున్న ఓ తమాషా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా వారిలో ఓ వ్యక్తి అతి తెలివి చూసి అంతా నవ్వుకున్నారు. బైకు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ (Helmet) ధరించాడు. అయితే వెనుక ఉన్న వ్యక్తి మాత్రం హెల్మెట్ కాకుండా.. ఓ పేపర్ కవర్‌ను (Paper cover) మొఖం తనిపించకుండా తలపై పెట్టుకున్నాడు.

Earthquake Under Sea: మునుపెన్నడూ చూడని అద్భుత దృశ్యం.. సముద్ర గర్భంలో భూకంపం వస్తే ఎలా ఉంటుందో చూడండి..!

ఇతన్ని చూడగానే అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కొందరు అతన్ని ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కాగా, ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే! ఈ వ్యక్తి విచిత్రంగా ఉన్నాడే’’.. అని కొందరు, ‘‘చలి తట్టుకునేందుకు ఇలా చేశాడేమో’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Video: కారులో రావాల్సిన వరుడిని సడన్‌గా ఇలా చూసి అవాక్కైన బంధువులు.. పెళ్లికి ముందే ముచ్చట తీర్చుకున్నాడుగా..!

Updated Date - 2023-11-15T16:53:44+05:30 IST