Share News

Telangana Election: ఎలక్షన్స్‌కు ఫండింగ్.. మాజీ కార్పోరేటర్ సోదరుడి వద్ద ఏకంగా రూ.42 కోట్ల నగదు సీజ్.. కొనసాగుతున్న ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2023-10-13T10:03:04+05:30 IST

బెంగళూరులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు, బడా వ్యాపారులు ఇళ్లు... ఆఫీసులపై దాడులు జరుపుతున్నారు.

Telangana Election: ఎలక్షన్స్‌కు ఫండింగ్.. మాజీ కార్పోరేటర్ సోదరుడి వద్ద ఏకంగా రూ.42 కోట్ల నగదు సీజ్.. కొనసాగుతున్న ఐటీ సోదాలు

బెంగళూరు : బెంగళూరులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు, బడా వ్యాపారులు ఇళ్లు... ఆఫీసులపై దాడులు జరుపుతున్నారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు బెంగళూరు నుంచి ఫండింగ్ జరుగుతుందనే సమాచారంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ సోదరుడి వద్ద రూ.42 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హొస్కోటలోని బిర్యానీ సెంటర్లపైనా దాడులు నిర్వహిస్తున్నారు. ఓ హోటల్ యజమాని ఇంటిలో 30కి పైగా క్యూఆర్ కోడ్ స్కానర్‌లను గుర్తించారు. ఓ హోటల్ యజమాని వద్ద రూ. 1.47 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు.

Updated Date - 2023-10-13T10:36:20+05:30 IST