Home » Bangladesh Protests
షేక్ హసీనా రాజీనామాతో పాటు.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాపైనే ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఉంది.
బంగ్లాదేశీయులు లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. స్వదేశంలో పరిణామాలను సోమవారం వీరంతా అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.
స్వాతంత్య్రం కోసం పోరాడి.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి.. సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు, సోదరులను కోల్పోయి.. భారత్‌లో ప్రవాసంలో గడిపి.. మాతృభూమికి తిరిగెళ్లి.. ప్రధానిగా రికార్డు కాలం పనిచేసిన షేక్ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్-బంగ్లాదేశ్ వాణిజ్యంపై పడుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్) నిఘాను పెంచింది.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా అనంతరం హసీనా బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి లండన్ వెళ్లబోతున్నారు.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న వేళ ఆ దేశంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆర్మీ హెలీకాఫ్టర్లో భారత్‌లో అడుగుపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు.